Anil Ravipudi: ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వినలేను, చూడలేనేమో.. అనుకున్న రెండు జరిగాయి
ABN , Publish Date - Feb 01 , 2025 | 10:36 PM
ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్‌కి మెమరబుల్‌గా నిలిచినందుకు హ్యాపీ. ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. రేసులో ఉన్న ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలను సైతం బీట్ చేసి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. పొంగల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌ను పురస్కరించుకుని హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌ని మేకర్స్ నిర్వహించారు.
Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత
ఈ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆడియన్స్ లేకపోతే ఈ విజయాన్ని మేము ఊహించలేము. ఎర్లీ మార్నింగ్ షోస్ కి ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూశారంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే. నా కెరియర్‌లో ఇది ఒక మిరాకిల్. ఈ విజయాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ వెంకటేష్‌గారికే దక్కుతుంది. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో పాటు ప్రమోషన్స్‌లో కూడా చాలా హెల్ప్ చేశారు. సినిమా టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్యూ. నిర్మాత హ్యాపీగా ఉండాలనే టార్గెట్ పెట్టుకుని మరి సినిమాలను తీస్తుంటాను. ఇప్పటివరకు 8 సినిమాలు చేస్తే, అందులో ఆరు సినిమాలు రాజు గారితోనే చేశాను. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బ్యానర్. ఆ బ్యానర్ కొన్ని జనరేషన్స్ ఉండాలి, ఉంటుంది.
ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌కి వచ్చిన నెంబర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్‌కి మెమరబుల్‌గా నిలిచినందుకు హ్యాపీ. ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయి. అవేంటంటే, కేవలం ఆరు రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజనల్ ఫిల్మ్‌కి చూడలేనేమో అనుకున్న 300 కోట్ల గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు చాలా బాధ్యత పెరిగింది. అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడూ ముందు వుంటాను. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్‌తో వేడుక జరిగింది.. నెక్స్ట్ ఎగ్జిబిటర్స్‌తో కూడా ఒక ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ షీల్డ్స్‌ని అందరికీ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు.