Sivangi Movie: ఆనంది హీరోయిన్ గా శివంగి..
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:09 PM
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శివంగి’ (Sivangi). దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన విమెన్ సెంట్రిక్ మూవీ ఇది
ఆనంది(Anandi), వరలక్ష్మి శరత్‌కుమార్ (Vara Lakshmi Sarathkumar)ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శివంగి’ (Sivangi). దేవరాజ్ భరణి ధరణ్ (Devaraj Bharani Dharan) దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన విమెన్ సెంట్రిక్ మూవీ ఇది. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. గురువారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. "సినిమా ఎంత పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో ఉండబోతోందో ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది’’ అని ఆయన అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నల్ల లుంగీ, చొక్కాతో కాళ్ళపై కళ్ళు వేసుకొని సోఫాలో డైనమిక్‌గా కూర్చున్న ఆనంది లుక్ ఆకట్టుకునేలా ఉంది. "విమెన్ సెంట్రిక్ సినిమాలలో శివంగి గ్రౌండ్ బ్రేకింగ్ కథ స్క్రీన్ ప్లే వుండబోతోంది. ఫస్ట్ లుక్‌తో సినిమాపై సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది’’ అని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 7న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.