Anchor Suma: జీవన యానంలో పవిత్ర జ్ఞాపకంగా.. 

ABN , Publish Date - Mar 01 , 2025 | 11:06 PM

మహాశివరాత్రి  మహాలింగోద్భవ  పవిత్ర ఘట్టం  ముగిసి మూడు రోజులైనా ఈ అపురూప పవిత్ర అభిషేక ఘట్టం తన జీవన యానంలో ఒక  అందమైన పవిత్ర జ్ఞాపకంగా మిగులుతుందని ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల పేర్కొన్నారు. 

మహాశివరాత్రి  మహాలింగోద్భవ పవిత్ర ఘట్టం  ముగిసి మూడు రోజులైనా ఈ అపురూప పవిత్ర అభిషేక ఘట్టం తన జీవన యానంలో ఒక  అందమైన పవిత్ర జ్ఞాపకంగా మిగులుతుందని ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) పేర్కొన్నారు. సినీ నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి (Sai KOrrapati) అతి అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో  కోట్లాది రూపాయలతో నిర్మించిన ' శ్రీ అమృతేశ్వర ఆలయం'లో ఈ  మహాశివరాత్రి పర్వదిన వేళ  గర్భగుడిలో  వేదవేత్తలు మంత్ర ధ్వనుల మధ్య తాను స్వయంగా మహాస్పటిక లింగాని కి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని సుమ చెప్పారు.

1.jpg


అభిషేకానంతరం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ ... అడుగడుగునా, అనుభూతిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ అమోఘమైన శ్రీ అమృతేశ్వర ఆలయ నిర్మాణ సమయంలో  సాయి కొర్రపాటి ఎన్నో కష్టాలని కటాక్షాలుగా మార్చుకుని నిస్వార్ధ సేవగా అంకితం చేయడం వల్లనే  శివ భక్తుల పాలిట కల్పవృక్షమై తరాలపాటు చెప్పుకునేలా ఈ ఆలయం వరాలు వర్షిస్తోందని చెప్పారు.

గత సంవత్సరం మాఘమాసంలోనే  ప్రారంభించబడిన ఈ ఆలయ ప్రారంభ వేడుకలో సాయి కొర్రపాటి సన్నిహితులు, దర్శక ధీరులు  ఎస్. ఎస్. రాజమౌళి,   రమా రాజమౌళి, ఎం. ఎం. కీరవాణి, శ్రీవల్లి, కేజీఎఫ్ హీరో యశ్ పాల్గొన్నారు. 

Updated Date - Mar 02 , 2025 | 12:01 PM