Shivangi: సత్యభామరా.. సవాల్ చేయకు చంపేస్తా
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:17 PM
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో నరేష్ బాబు పి. నిర్మించిన 'శివంగి'.
ఆనంది(Anandi), వరలక్ష్మి శరత్‌కుమార్ (VaraLakshmi Sarathkumar) ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ (Devaraj Bharani Dharan) దర్శకత్వంలో నరేష్ బాబు పి. నిర్మించిన 'శివంగి'. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు చక్కని స్పందన వచ్చింది. ఆదివారం ఈ సినిమా థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 'అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు వుంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి' అంటూ ఆనంది చెప్పిన డైలాగ్ తో ఓపెన్ అయిన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సాగింది.
వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఆనందిని విచారించడం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఆనంది జీవితంలో జరిగిన విషయాలు చాలా సస్పెన్స్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. సత్యభామ క్యారెక్టర్లో ఆమె పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సత్యభామరా .. సవాల్ చేయకు చంపేస్తా' అనే డైలాగ్ అదిరిపోయింది. మార్చి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది.