Anaganaga Australia Lo: 122 రోజుల్లో 83 లోకేషన్స్‌లో..

ABN , Publish Date - Mar 15 , 2025 | 07:50 PM

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మన దగ్గర ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ విదేశాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉండబోతాయో తెలియాలంటే ...

సహాన ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బి.టి.ఆర్‌ శ్రీనివాస్‌ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'అనగనగా ఆస్ట్రేలియాలో'(Anaganaga Australia Lo). ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. దర్శకుడు తారక రామ (Taraka Rama) మాట్లాడుతూ "షూటింగ్‌ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా తెలుగువారే.  చిన్నతనం నుంచి సినిమాలపై ఇష్టంతో జాబ్‌ చేసుకుంటూనే ఫిల్మ్‌ కోర్స్‌లో మాస్టర్స్‌ చేశాను. సినిమాపై ఉన్న ఇష్టమే ఈ సినిమా చేసేలా చేసింది. ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ వాతావరణం చాలా వింతగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సినిమా చేయడం చాలా కష్టమైనప్పటికీ ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉంది. మొత్తం షూటింగ్‌ 122 రోజుల్లో 83 లోకేషన్స్‌లో చేశాం. ప్రస్తుతం తెలుగులో రిలీజ్‌ చేసున్నాం. మార్చి 21 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు.


"యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మన దగ్గర ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ విదేశాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉండబోతాయో తెలియాలంటే మార్చి 21 వరకు వేచి చూడాల్సిందే’’ అని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Mar 15 , 2025 | 08:00 PM