అమరావతికి ఆహ్వానం.. ఇంటెన్స్ లుక్..
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:19 PM
ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం 'అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం 'అమరావతికి ఆహ్వానం’ (Amaravathi ahwanam). శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.
ఇందులో లీడ్ యాక్టర్స్ అంతా బ్లాక్ డ్రెస్ వేసుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫేస్‌లు పూర్తిగా రివీల్ కానప్పటికీ అందరి కళ్లలో ఒకేరకమైన ఇంటెన్సిటీ ఉంది.. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ చెప్పారు.