ఉత్కంఠభరితంగా సాగే...
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:33 AM
‘అక్కడొకడుంటాడు’ ఫేమ్ శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’...
‘అక్కడొకడుంటాడు’ ఫేమ్ శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జి.వి.కె దర్శకత్వంలో కె.ఎ్‌స.శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు జి.వి.కె మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రతీక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ప్రేక్షకులను తప్పక మెప్పిస్తుంది. హారర్ చిత్రాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుంది’’ అని చెప్పారు.