Telugu Romantic Drama: అందరినీ మెప్పిస్తుంది
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:56 AM
‘ఏ.ఎల్.సి.సి’ అనే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. జేపీ నవీన్, శ్రావణి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది,
Telugu Romantic Drama: జేపీ నవీన్, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఏ.ఎల్.సి.సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). లేలేధర్‌రావు కోలా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు లేలేధర్‌రావు మాట్లాడుతూ ‘‘సినిమా అన్ని వర్గాల వారినీ మెప్పిస్తుంది. చిత్రం కోసం టీమ్ ప్రాణం పెట్టి పనిచేసింది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు కథ, విజువల్స్, సంగీతం ప్రధానాకర్షణ’’ అని హీరో జేపీ నవీన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, నగేష్ తదితరులు పాల్గొన్నారు.