Malayalam: తెలుగులో రాబోతున్న అలప్పుజ జింఖానా...
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:38 PM
మలయాళ చిత్రాలు తెలుగులో ఈ మధ్యకాలం కాస్తంత ఎక్కువగానే డబ్ అవుతున్నాయి. అలా ఈ నెల 25న మలయాళ అనువాద చిత్రం 'జింఖానా' తెలుగువారి ముందుకు రాబోతోంది.
మలయాళం (Malayalam) లో చక్కని విజయాన్ని అందుకున్న 'అలప్పుజ జింఖానా' (Alappuzha Gymkhana) ఇప్పుడు తెలుగులో రాబోతోంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను ఏప్రిల్ 25న రెండు తెలుగు రాష్ట్రాలలో 'జింఖానా' (Gymkhana) పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'ప్రేమలు' ఫేమ్ నజ్లెన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఖలీద్ రహ్మాన్ తెరకెక్కించారు. వైబ్స్, ఫైట్స్, ఫన్ బ్లెండ్ తో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ పోషించారు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా, విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు.
Also Read: Samantha: సమంత శుభం పలికేది ఎప్పుడంటే...
Also Read: Kalyan Ram: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ
Also Read: Madhuram movie : మధురం సినిమా రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి