ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు

ABN , Publish Date - Mar 17 , 2025 | 02:23 AM

ప్రదీప్‌ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి కథానాయిక. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

ప్రదీప్‌ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి కథానాయిక. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఆదివారం విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్‌ 11న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. కొత్త తరహా ప్రేమకథతో తెరకెకి ్కన చిత్రమిదనీ, కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునే హంగులతో తెరకెక్కించామనీ మేకర్స్‌ తె లిపారు. వెన్నెల కిశోర్‌, సత్య, గెటప్‌ శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రధన్‌ సంగీతం అందిస్తున్నారు. కథ, మాటలు: సందీప్‌ బొల్లా, సినిమాటోగ్రఫీ:ఎంఎన్‌ బాల్‌రెడ్డి, ఎడిటర్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌

Updated Date - Mar 17 , 2025 | 02:23 AM