రెడ్‌ డ్రాగన్‌ అజిత్‌

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:14 AM

ఇటీవలె విడుదలైన ‘పట్టుదల’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు తమిళ నటుడు అజిత్‌కుమార్‌. ఆయన కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో

ఇటీవలె విడుదలైన ‘పట్టుదల’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు తమిళ నటుడు అజిత్‌కుమార్‌. ఆయన కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. త్రిష కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రెడ్‌ డ్రాగన్‌గా శక్తిమంతమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. ‘నువ్వు ఎంతమంచివాడివైనా.. ఈ ప్రపంచం నిన్ను చెడుగా మార్చేస్తుంది’ అని అజిత్‌ చెప్పిన డైలాగ్‌.. పోరాట ఘట్టాలు, విజువల్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఏప్రిల్‌ 10న సినిమా విడుదల కానుంది.

Updated Date - Mar 02 , 2025 | 04:14 AM