Bandi: ఆదిత్య ఓం ‘బందీ’.. ఏ స్టేజ్‌లో ఉందంటే..
ABN , Publish Date - Jan 09 , 2025 | 10:16 PM
‘లాహిరి లాహిరి లాహిరిలో’ ఫేమ్ ఆదిత్య ఓం ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన సినిమాలన్నీ వైవిధ్యభరిత సినిమాలే. తాజాగా ఆయన చేసిన సినిమా ‘బందీ’. ఈ సినిమా అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.
ప్రస్తుతం ప్రేక్షకులు రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ ప్రధానంగా ఉన్న చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ఫేమ్ ఆదిత్య ఓం ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన సినిమాలన్నీ వైవిధ్యభరిత సినిమాలే. ఇటీవల బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా మంచి ఆదరణను పొందిన ఆదిత్య ఓం.. ఆ షో అనంతరం తన సినిమాలతో బిజీబిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటించిన కంటెంట్ బేస్డ్ చిత్రం ‘బందీ’. ఈ సినిమా అప్డేట్‌ని తాజాగా చిత్రయూనిట్ తెలియజేసింది.
Also Read- King Nagarjuna: సీఎం రేవంత్ ఆదేశించారు.. కింగ్ నాగ్ పాటించారు
ఇప్పటికే ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విశేషం ఏమిటంటే.. సింగిల్ క్యారెక్టర్‌తో ఈ ‘బందీ’ సినిమాను తెరకెక్కించారు. గల్లీ సినిమా బ్యానర్‌పై ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పతనం చాటి చెప్పేలా ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, ట్రైలర్ సినిమాలోని డెప్త్‌ను చాటిన విషయం తెలిసిందే.
నేచురల్ లొకేషన్స్‌లో ఈ మూవీని షూట్ చేశారు. దేశంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో కష్టాలు పడుతూ, ఎటువంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని మూవీ యూనిట్ చెబుతోంది. ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా ఈ చిత్రం ఉండబోతోందని.. త్వరలోనే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.