The Devils Chair: మనిషికి ఉండే దురాశ ఇతివృత్తంతో ‘ది డెవిల్స్‌ చైర్‌’

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:11 PM

గంగ సప్త శిఖర (ganga sapta sikhara) దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్‌ చైర్‌’ (The devils Chair) . జబర్దస్త్‌ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు. ఈ హారర్‌ సినిమా కోసం అప్డేటెడ్‌ ఏఐ టెక్నాలజీ ఉపయోగించారట దర్శకుడు


గంగ సప్త శిఖర (ganga sapta sikhara) దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్‌ చైర్‌’ (The devils Chair) . జబర్దస్త్‌ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు. ఈ హారర్‌ సినిమా కోసం అప్డేటెడ్‌ ఏఐ టెక్నాలజీ ఉపయోగించారట దర్శకుడు. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్‌ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందని చెబుతున్నారు. గతంలో ఆయన తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌ పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టాయి.  

devil.jpg

అదిరే అభి మాట్లాడుతూ ‘ది డెవిల్స్‌ చైర్‌ అనే టైటిల్‌ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మంచి కాన్సెప్ట్‌తోపాటు చక్కని సందేశం కూడా ఉంది. దర్శకుడు గంగ సప్త శిఖర ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరినీ భయపెట్టేలా హరర్‌గా  ఉంటుంది’ అని అన్నారు. ‘‘ది డెవిల్స్‌ చైర్‌’ చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్‌ చేస్తుంది. డెవిల్‌ మీ ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది. కథకు కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది’ అని దర్శకుడు గంగ సప్త శిఖర అన్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

Updated Date - Feb 20 , 2025 | 06:14 PM