Abhinaya Wedding: మలయాళ చిత్రం ‘పని’ ఫేమ్‌, నటి అభినయ పెళ్లి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:46 AM

నటి అభినయ తన సుదీర్ఘకాల మిత్రుడు కార్తీక్‌ వేగ్నేశ్‌తో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పెళ్లి ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో పంచుకున్నారు

మలయాళ చిత్రం ‘పని’ ఫేమ్‌, నటి అభినయ తన చిరకాల మిత్రుడు కార్తీక్‌ వేగ్నేశ (సన్నీ వర్మ)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫొటోలను ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మార్చి 9న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈనెల 20న సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. కాగా, ‘శంభో శివ శంభో’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు అభినయ.

Updated Date - Apr 18 , 2025 | 12:48 AM