కొత్త ప్రయాణం మొదలు

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:36 AM

నటి అభినయ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. చిన్ననాటి స్నేహితుణ్ణి ప్రేమించాననీ, త్వరలో అతన్ని పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె తెలిపారు....

నటి అభినయ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. చిన్ననాటి స్నేహితుణ్ణి ప్రేమించాననీ, త్వరలో అతన్ని పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె తెలిపారు. ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిన య తెలిపారు. కాబోయే భర్తతో కలసి ఆలయంలో గంట కొడుతున్న ఫొటోను షేర్‌ చేసి, ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు. అయితే కాబోయే భర్త వివరాలు, పెళ్లి ఎప్పుడు జరగబోతోంది అనే విషయాలను ఆమె తెలపలేదు. పలు దక్షిణాది సినిమాల్లో నటించిన అభినయ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో’ తదితర చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated Date - Mar 10 , 2025 | 04:36 AM