Movie Release Controversy: ‘అబిర్‌ గులాల్‌’ పై నిషేధం

ABN , Publish Date - Apr 25 , 2025 | 06:11 AM

పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌, వాణీకపూర్‌ జంటగా నటించిన ‘అబిర్‌ గులాల్‌’ చిత్రాన్ని భారత్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌, వాణీకపూర్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘అబిర్‌ గులాల్‌’ని భారత్‌లో విడుదల కాకుండా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిషేధించింనట్లు సమాచారం. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేనథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మే 9న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించగానే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దాడి జరిగిన రోజునే ప్రమోషన్‌ను ప్రారంభించడంపై వాణీకపూర్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ సినిమాలోని పాటలను యూట్యూబ్‌(ఇండియా) నుంచి తొలగించారు.

Updated Date - Apr 25 , 2025 | 06:12 AM