Abhinav: డ్రగ్స్ రహిత సమాజం కోసం
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:43 PM
ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో అలరించి, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. తాజాగా ఆయన 'అభినవ్' (ABhinav) చిత్రంతో రాబోతున్నారు.
ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో అలరించి, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. తాజాగా ఆయన 'అభినవ్' (ABhinav) చిత్రంతో రాబోతున్నారు. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ుూమన సమాజానికి జాఢ్యంలా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు అనేది ఈ కథ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను తీశాను. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించింది. ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు. మన దేశం ఆర్థికంగా వెనకబాటుకు పిల్లల్లో అక్షరాస్యత లేకపోవడం కూడా కారణం. చక్కని సందేశం ఇచ్చే చిత్రమిది’’ అన్నారు.