ఆది కెరీర్‌ను మలుపు తిప్పుతుంది

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:40 AM

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా షణ్ముగం సాప్పని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షణ్ముఖ. ఈ డివోషనల్‌ థ్రిల్లర్‌ను షణ్ముగం సాప్పని, తులసీరామ్‌ సాప్పని, రమేశ్‌ యాదవ్‌ నిర్మించారు..

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా షణ్ముగం సాప్పని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఈ డివోషనల్‌ థ్రిల్లర్‌ను షణ్ముగం సాప్పని, తులసీరామ్‌ సాప్పని, రమేశ్‌ యాదవ్‌ నిర్మించారు. ఈ నెల 21న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ రఘునందన్‌ రావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టైటిల్‌లోనే ఏదో ప్రత్యేకత ఉంది. సినిమా ఆది కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా అందరి కష్టం. అవికా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చింది’’ అని హీరో ఆది చెప్పారు. ‘‘ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా అందరి మనసులను గెలుచుకుంటుంది’’ అని దర్శకుడు షణ్ముగ సాప్పని తెలిపారు. ‘‘ఈ సినిమాలో ఆది నటనకు అందరూ ఫిదా అవుతారు’’ అని హీరోయిన్‌ అవికా గోర్‌ చెప్పారు.

ఎంపీ రఘునందన్‌ రావు

Updated Date - Mar 18 , 2025 | 02:40 AM