చరిత్రలో నిలిచిపోయే చిత్రం...

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:27 AM

‘మల్లేశం’, ‘8 ఏఎమ్‌ మెట్రో’ చిత్రాల దర్శకుడు రాజ్‌ రాచకొండ. ఆయన దర్శకత్వంలో కొత్త చిత్రం రాబోతోంది. నటుడు రానా దగ్గుబాటి సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా, స్టూడియో 9తో కలసి నిర్మిస్తోంది...

‘మల్లేశం’, ‘8 ఏఎమ్‌ మెట్రో’ చిత్రాల దర్శకుడు రాజ్‌ రాచకొండ. ఆయన దర్శకత్వంలో కొత్త చిత్రం రాబోతోంది. నటుడు రానా దగ్గుబాటి సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా, స్టూడియో 9తో కలసి నిర్మిస్తోంది. తేజ, తన్మయి, ఝాన్సీ, తాగుబోతు రమేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘23’ అనే టైటిల్‌ను ఖరారు చేసి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌ రాచకొండ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మానవ హక్కుల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. అన్యాయానికి గురైన వారికి అండగా ఉంటుంది. తప్పు చేయడం తప్పని చెప్పడంతో పాటు హింసకు వ్యతిరేకంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు వెతుక్కుంటూ వచ్చి చూస్తారు. చరిత్రలో నిలబడిపోతుంది’’ అని నటి ఝాన్సీ చెప్పారు.

Updated Date - Mar 10 , 2025 | 04:27 AM