విభిన్నతరహా చిత్రం
ABN , Publish Date - Mar 03 , 2025 | 02:29 AM
ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య ద్వయం దర్శకత్వం వహిస్తుండగా, ఆర్.యు.రెడ్డి నిర్మిస్తున్నారు....
ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య ద్వయం దర్శకత్వం వహిస్తుండగా, ఆర్.యు.రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రసన్నకుమార్. టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు వీరశంకర్, నిర్మాత నవీన్ యెర్నేని స్ర్కిప్టును అందజేశారు. సినిమా విభిన్న తరహాలో ఉండబోతోందని మేకర్స్ తెలిపారు.