కుటుంబ కథా చిత్రం
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:44 AM
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా దర్శకద్వయం నితిన్-భరత్ తెరకెక్కించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు...
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా దర్శకద్వయం నితిన్-భరత్ తెరకెక్కించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కుటుంబ కథా చిత్రాన్ని మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ ‘సినిమా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఈ చిత్రం ఒక మెట్టు అవుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు. దర్శకులు నితిన్-భరత్ మాట్లాడుతూ ‘సినిమా చాలా అధ్భుతంగా వచ్చింది’ అని చెప్పారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ‘తన క్యారెక్టర్‌లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి’ అని తెలిపారు.