JR NTR - Hrithik Roshan: వార్‌-2 అప్‌డేట్‌ ఇదే..

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:02 PM

బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan), టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’ (War -2) . ఈ చిత్రానికి రైటర్ గా పని చేస్తున్న అబ్బాస్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.


బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan), టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’ (War -2) . అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ( Ayan Mukerji)రానున్న ఈ స్పై థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రానికి రైటర్ గా పని చేస్తున్న అబ్బాస్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘వార్‌ 2’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఆగస్టు 25న (War -2 release Date) విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరోజు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌లను థియేటర్‌లో కలుద్దాం. ‘వార్‌ 2’లో డైలాగులన్నీ నేనే రాశాను. అందరికి నచ్చేలా ఉంటాయి. షారుక్‌ఖాన్‌, సిద్థార్థ్‌ ఆనంద్‌ల కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుంది.  'పఠాన్‌ 2’ కూడా సిద్థమవుతోంది. ఈ రెండు సినిమాలకు రచయితగా  వర్క్‌ చేస్తున్నాను. ’’ అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్‌ తెలిపారు.  


హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘వార్‌’. ఈ స్పై థ్రిల్లర్‌ సూపర్‌హిట్‌ కావడంతోపాటు భారీ వసూళ్లు రాబట్టింది. సినిమాపై అంచనాలు ఉండటంతో దీనికి సీక్వెల్‌గా ‘వార్‌2’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ఖాన్‌లు ఏజెంట్‌ పాత్రల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్‌ పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్‌ ఓ షెడ్యూల్‌ చేసి వచ్చారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తారక్‌ ప్రశాంత్‌ నీల్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొనున్నారు.

Updated Date - Feb 20 , 2025 | 02:02 PM