Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:16 PM
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మ (Vijay Varma) తమ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టారని, ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మ (Vijay Varma) తమ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టారని, ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు. ‘‘రిలేషన్‌షిప్‌ను (Breakup rumours) ఒక ఐస్‌క్రీమ్ తిన్నట్లు ఆద్యంతం ఆస్వాదించాలి. అలా చేసినప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. సంతోషం, కోపం, బాధ, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని స్వీకరించాలి. దానితోపాటే ముందుకు సాగాలి. రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలి. ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకొనే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని స్వీకరించాలి’’ అని విజయ్ వర్మ అన్నారు. ఇటీవల ఓ వేదికపై తమన్నా కూడా ప్రేమ గురించి మాట్లాడారు. నిస్వార్థమైన ప్రేమను నేను నమ్ముతాను. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలుపెడతామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి’’ అని తెలిపారు. రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే తాను ఆనందంగా ఉన్నానని.. భాగస్వామి ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె హెచ్చరించిన సంగతి తెలిసిందే!
2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’లో తమన్నా, విజయ్ వర్మ నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. రిలేషన్‌లో ఉన్నప్పుడు ప్రతి ఫంక్షన్‌కు కలిసి హాజరైన ఈ జంట.. ఇటీవల జంటగా ఎక్కడా కనిపించడం లేదు. రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సెలబ్రేషన్స్‌కు విడివిడిగా హాజరయ్యారు. ఎక్కడా ఇద్దరు కలిసున్న ఫొటోలు కూడా లేవు. దీంతో ఈ జంట నిజంగా విడిపోయారని ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు.