Vicky kaushal: అప్పుడలా జరిగిపోయింది.. ఇప్పటికీ ఆ బాధ ఉంది..
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:43 PM
గతంలో ఓ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. హారర్ కామెడీ నేపథ్యంలో అమర్ కౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ’ (Stree movie) శ్రద్థాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఛత్రపతి శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’తో (Chhavva) ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal). లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని ఆదరణ పొందింది. సక్సెస్‌లో భాగంగా విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే గతంలో ఓ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. హారర్ కామెడీ నేపథ్యంలో అమర్ కౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ’ (Stree movie) శ్రద్థాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత ఈ చిత్రం కోసం దర్శకుడు విక్కీ కౌశల్‌ను సంప్రదించారట. అయితే విక్కీ అప్పటికే మరో చిత్రంతో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.
ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మన్మర్జియాన్ చేస్తున్న సమయంలో అమర్ నాకు ‘స్త్రీ’ కథ నెరేట్ చేశారు. కానీ, నాకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాను వదులుకున్నాను. ‘స్త్రీ’ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధ పడుతున్నాను’’ అని అన్నారు. ‘స్త్రీ’ సినిమాలో విక్కీ ప్లీజ్ అనే డైలాగు ఎంతో ఫేమస్ అయింది. ఈ డైలాగును విక్కీ కౌశల్‌ను ఉద్దేశించే పెట్టినట్లు దర్శకుడు ఒక సందర్భంలో చెప్పారు. 2018లో విడుదలైన ‘స్త్రీ’ సినిమా పెద్ద హిట్టైంది. ఇటీవల దీని సీక్వెల్‌ను రూపొందించారు. మొదటి భాగంలో నటీనటులతో అమర్ కౌశక్ రెండో పార్ట్ 2 తీశారు. సీక్వెల్ కూడా సూపర్ హిట్‌గా నిలిచి రూ.800 కోట్లు వసూళ్లు రాబట్టింది.