Chhaava Craze: గుర్రంపై వచ్చి 'ఛావా' సెలబ్రేషన్స్‌.. కట్రీన ప్రశంసలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:57 PM

"ప్రపంచంలో ప్రతి ఇంటికీ ఈ చిత్రం చేరాలని కోరుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా నాగ్‌పుర్‌లో ఓ అభిమాని ఈ సినిమాను సెలబ్రేట్‌ చేసుకున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది.

బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ుఛావా’ చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని కదిలించింది. చిన్న పిల్లల్ని సైతం కంట తడి పెట్టించింది. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదే టాపిక్‌ నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్‌పై హీరో విక్కీ స్పందించారు. "ప్రపంచంలో ప్రతి ఇంటికీ ఈ చిత్రం చేరాలని కోరుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా నాగ్‌పుర్‌లో ఓ అభిమాని ఈ సినిమాను సెలబ్రేట్‌ చేసుకున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా పూర్తికాగానే ఏకంగా గుర్రంపై శంభాజీ వేషధారణలో స్క్రీన్  ముందుకువచ్చి కనిపించాడు. ఇది చూసిన వారంతా జై శంభాజీ మహారాజ్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.  

ఛావా చిత్రాన్ని చిన్నా, పెద్ద తేడా లేకుండా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సినిమాను చూసిన ఓ చిన్నారి చేసిన నినాదాలు అందరిలో భావోద్వేగాన్ని నింపాయి. శంభాజీ మహారాజ్‌కు జై’, ‘జై భవానీ’.. నినాదాలతో థియేటర్‌ అంతా దద్దరిల్లింది. ఆ చిన్నారి వీడియోను విక్కీ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇది మేము సొంతం చేసుకున్న నిజమైన గౌరవం. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీ దగ్గర ఉండి ఉంటే ప్రేమగా హత్తుకునే వాడిని. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ శంభాజీ రాజు కథ ప్రపంచంలోని ప్రతి ఇంటికీ చేరాలని కోరుకుంటున్నా. అలా జరగడం మా గొప్ప విజయం’’ అని క్యాప్షన్‌ పెట్టారు.


ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన విక్కీ భార్య కట్రీనా కైఫ్‌ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమాలో విక్కీ నటన చూసి కత్రినా కైఫ్‌, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఎంతో గర్వంగా ఉన్నట్లు చెబుతున్నారు. కత్రిన సోషల్‌ మీడియాలో సినిమా గురించి పోస్ట్‌ పెట్టారు. విక్కీ నటన చూసి తాను ఆశ్చర్యపోయి నట్లు తెలిపారు. విక్కీ ఇక ఈ సినిమా పూర్తైన తర్వాత ప్రేక్షకులు థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. చివరి 40 నిమిషాలు సినిమా గురించి మాటల్లో చెప్పలేను. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ అవుడ్‌స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. తెరపై విక్కీ కనిపించిన ప్రతిసానీ ఇంటెన్‌సిటీ కనిపించింది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి కష్టం తెరపై కనిపించింది’’ అంటూ కట్రీనా ప్రశంసల వర్షం కురిపించారు. 

Updated Date - Feb 18 , 2025 | 05:57 PM