Akshay kumar: ఫెయిల్యూర్ తో పనిలేదు.. చేసుకెళ్లిపోవడమే ..

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:23 AM

ఈ ఏడాది ‘స్కై ఫోర్స్‌’తో (Sky force) ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ (Akshay kumar) కు జయాపజయాలతో పని లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు ఎక్కిస్తారు. ఈ ఏడాది ‘స్కై ఫోర్స్‌’తో (Sky force) ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో (venkat Prabhu) ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ లోను టాక్ నడుస్తోంది.  


‘‘గతేడాది ‘గోట్‌’తో(Goat) మంచి విజయాన్ని అందుకున్నారు వెంకట్‌ ప్రభు. ఇప్పుడాయన అక్షయ్‌ కోసం ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని సమాచారం. అక్షయ్‌ స్క్రిప్ట్‌ విన్న వెంటనే చిత్రాన్ని అంగీకరించారని,  త్వరలో షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని  అక్షయ్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

ALSO READ: Saptagiri: మహారాజు లాంటి మనస్తత్వం ఆయనది

Mikey Madison - Oscar: చిన్న వయసులో చరిత్రకెక్కింది 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 16 , 2025 | 01:13 PM