Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:18 PM
బాలయ్య ‘డాకు మహారాజ్’ బ్యూటీ సారీ చెప్పింది. ఎందుకు చెప్పింది? అసలు విషయం ఏమిటి? అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్‌పై దాడి నేపథ్యంలో బాలయ్య బ్యూటీ రియాక్ట్ అయిన తీరు పలు విమర్శలకు తావిచ్చింది. దీంతో అమ్మడు దిగిరాక తప్పలేదు. అసలు విషయం ఏమిటంటే..
ఒక్కోసారి మనం చేసే పని మంచిదైనా.. ఆ పని చేసే క్రమంలో మన ప్రవర్తన ఎదుటివారికి ఇబ్బందిని కలిగించవచ్చు. కొన్ని సెన్సిటివ్ విషయాలలో ఆ ప్రవర్తన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందనేది తాజాగా బాలయ్య ‘డాకు మహారాజ్’ బ్యూటీ చేసిన పని చూస్తే తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఎందుకు సారీ చెప్పిందనే విషయంలోకి వెళితే..
Also Read: Daaku Maharaaj Review: బాలయ్య నటించిన మాస్ మసాలా మూవీ ‘డాకు మహారాజ్’ ఎలా ఉందంటే
రీసెంట్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటిలో.. ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. లీలావతి హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ లోపు ఆ దాడి చేసిన వాడిని పట్టుకునేందుకు పోలీలులు పలు బృందాలుగా విడిపోయి సెర్చ్ చేస్తున్నారు. ఇక సైఫ్‌పై దాడి ఘటన ముంబైని మరోసారి వార్తలలో నిలిపింది. అంతకు ముందు సల్మాన్ విషయంలో బాలీవుడ్ ఎలా అలెర్ట్ అయిందో తెలియంది కాదు. ఇప్పుడు సైఫ్ పై కూడా దాడి జరగడంతో భయాందోళనలో బాలీవుడ్ మునిగిపోయింది. దీంతో, గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ స్పందించారు. టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలయ్య ‘డాకు మహారాజ్’లో నటించిన ఊర్వశి రౌతేలా కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ఓ వీడియోను షేర్ చేసింది. అయితే, ఆ వీడియోనే ఆమెపై ట్రోలింగ్‌కు కారణమవడం విశేషం.
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని చెబుతూ.. చేతికి ఉన్న వజ్రటపు ఉంగరాన్ని నెటిజన్లకు అదే పనిగా చూపిస్తూ మాట్లాడింది. అంతే, ఆమె ప్రవర్తనపై హాట్ హాట్‌గా కామెంట్స్ పడుతూ.. ఒక్కసారిగా వైరల్ అవడంతో.. చేసేది లేక వెంటనే ఊర్వశి క్షమాపణలు కోరింది. సైఫ్ అలీఖాన్ గురించి మాట్లాడిన సమయంలో తన ప్రవర్తనకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ ఇన్ స్టాలో ఆమె ఓ పోస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డానని.. ఆ సమయంలో సైఫ్ చూపించిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమని.. ఆయనపై మరింతగా గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.