Upasana SIngh: సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా.. అన్నాడు.

ABN , Publish Date - Jan 03 , 2025 | 02:37 PM

‘ది కపిల్‌ శర్మ షో’తో విశేష ఆదరణను సొంతం చేసుకున్నారు నటి ఉపాసన సింగ్‌ Upasana Singh) . తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు.

‘ది కపిల్‌ శర్మ షో’తో విశేష ఆదరణను సొంతం చేసుకున్నారు నటి ఉపాసన సింగ్‌ Upasana Singh) . తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు. ‘‘ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన సమయంలో నేనూ సమస్యలు ఎదుర్కొన్నా. దక్షిణాదికి చెందిన ఓ అగ్ర దర్శకుడి ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డా (Casting Couch). బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ను హీరోగా పెట్టి ఆయన ఒక సినిమా చేయాలనుకున్నారు. అందులోకి నన్ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఆమేరకు అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశా. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి మీటింగ్‌కు అమ్మ, చెల్లిని తోడు తీసుకువెళ్లేదాన్ని. ‘ప్రతి మీటింగ్‌కు వాళ్లనెందుకు తీసుకువస్తున్నావ్‌?’ అని ఓరోజు ఆ దర్శకుడు నన్ను ప్రశ్నించాడు. (Kapil SHarma Show)

Upasana.jpg

ఓసారి రాత్రి 11.30 గంటలకు ఫోన్‌ చేసి సిట్టింగ్‌ కోసం హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని, రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని బదులిచ్చా. దానికి ఆయన.. ‘నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అని అడిగాడు. నేను షాకయ్యా. ఆ తర్వాత రోజు ఉదయాన్నే కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్లందరి ముందు ఆయన్ని తిట్టి బయటకు వచ్చేశా. ఆ ప్రాజెక్ట్‌ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చాను. ఆ తర్వాత వారం పాటు బయటకు రాలేదు. అనిల్‌ కపూర్‌తో సినిమా చేస్తున్నానని అందరికీ చెప్పా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలా? అని ఆలోచించా. కానీ ఆ ఏడు రోజులే నన్ను మరింత స్ర్టాంగ్‌గా మార్చాయి. అమ్మ నాకెంతో సపోర్ట్‌ చేసింది. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ర్టీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. ‘మైనే ప్యార్‌ కియా’లో హీరోయిన్‌గా మొదట తననే ఎంచుకున్నారు.. సల్మాన్‌ఖాన్‌ కంటే ఎత్తుగా ఉండటం వల్ల నన్ను ఆ ప్రాజెక్ట్‌ నుంచి తొలగించారు’’ అని అన్నారు. 

Updated Date - Jan 03 , 2025 | 02:37 PM