Twinkle Khanna: రూమర్స్‌పై నటి సీరియస్..

ABN , Publish Date - Jan 26 , 2025 | 05:53 PM

Twinkle Khanna: "సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో భార్య కరీనా కపూర్ ఇంట్లో లేదని, ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఆ రోజు ఇంట్లో ఎందుకు లేదు అంటూ వార్తలు ప్రచురించారు. వాస్తవానికి ఆ రోజు కరీనా ఇంట్లో ఉందా లేదా అనేది ధృవీకరించకుండానే అనేక వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే."

Twinkle Khanna slams the blame game targeting Kareena Kapoor

ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఘటన గురించి బాలీవుడ్ నటి, రచయిత, అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్‌ ఖన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు సైఫ్ పై దాడి జరిగిన సమయంలో భార్య కరీనా కపూర్ ఇంట్లో లేదని, ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఆ రోజు ఇంట్లో ఎందుకు లేదు అంటూ వార్తలు ప్రచురించారు. వాస్తవానికి ఆ రోజు కరీనా ఇంట్లో ఉందా లేదా అనేది ధృవీకరించకుండానే అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా వీటిపై ట్వింకిల్‌ ఖన్నా స్పందించారు.


తాజాగా ఆమె తన బ్లాగ్ లో మహిళల గురించి రాస్తూ.. ‘‘సైఫ్‌ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన సతీమణి గురించి ఎన్నో వదంతులు వ్యాప్తి చెందాయి. ఆయనపై దాడి జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేదని కొందరు.. గాయాలతో ఇబ్బందిపడుతున్న ఆయనకు ఆమె ఏమాత్రం సాయం చేయలేదని మరికొందరు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ వదంతులు మాత్రం ఆగలేదు. మహిళ అందులోనూ ఒక వ్యక్తి భార్యపై నిందలు రావడంతో ప్రతిఒక్కరూ ఎంజాయ్‌ చేశారు. అదే విధంగా విరాట్‌ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా కొంతమంది ఆయన సతీమణి అనుష్క శర్మను నిందిస్తుంటారు’’ అంటూ రాసుకొచ్చారు.


మరోవైపు పోలీసులు ఈ కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాంని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, ఘటన స్థలంలో నిందితుడి ఫింగర్ ప్రింట్స్ దొరకకపోవడం కేసులో కొత్త మలుపుకు దారి తీస్తోందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఘటన స్థలంలో 19 వేలి ముద్రలను సేకరించిగా అందులో నిందితుడి వేలి ముద్రలు దొరకలేదు. దీంతో పోలీసులు మరోసారి వేలి ముద్రలు సేకరించనున్నారు.

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్..

Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు

Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్

Also Read- SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్‌.. ప్రియాంక ఫిక్స్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 05:59 PM