Saif Ali Khan: సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు దొరికేశాడు.. ఎవరంటే..
ABN , Publish Date - Jan 19 , 2025 | 09:12 AM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు దొరికేశాడు. అతనెవరో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. నిందితుడిని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు కూడా తనే దాడి చేసినట్లుగా పోలీసుల విచారణలో చెప్పడంతో.. అసలు నిందితుడు అతనే అని పోలీసులు రివీల్ చేశారు. అసలు నిందితుడు ఎవరంటే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతను కూడా దాడి చేసింది తనే అని పోలీసులు సమక్షంలో అంగీకరించారు. దీంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దాడి వెనుక కుట్ర ఉందా? లేక రాబరీ చేసేందుకే అతను వచ్చాడా? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు ఎవరంటే..
Also Read-Ram Charan: రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు.. కాదు కాదు అంతకుమించి!
ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. నిందితుడ్ని ముంబై పోలీసులు పట్టుకున్నారంటూ శుక్రవారం నాడు కథనాలు వచ్చాయి. బాంద్రా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు ఒకర్ని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. దీంతో నిందితుడు దొరికాడని అంతా అనుకున్నారు. అయితే తమ అదుపులో ఉన్నది నిందితుడు కాదని.. ఆ వ్యక్తికి సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది సేపటికే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో తాజాగా ముంబై పోలీసులు మరోమారు స్పందించారు. ఈ కేసులో అసలు నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. అసలు నిందితుడు ఎవరంటే.. విజయ్ దాస్ అని, అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. సైఫ్ మీద దాడి చేసింది తానేనని అతడు కూడా ఒప్పుకున్నాడని పేర్కొన్నారు.
Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!
నిందితుడు ఓ రెస్టారెంట్ వెయిటర్:
ఈ కేసులో పోలీసులు పలు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించినట్లుగా వార్తలు వచ్చాయి. నిందితుడు ఒక ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అంత ధైర్యంగా సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే.. అతనొక రెస్టారెంట్‌లో పనిచేసే సాధారణ వెయిటర్ అని పోలీసులు తేల్చారు. నిందితుడు కూడా దాడి చేసింది తనే అని ఒప్పుకోవడంతో.. ఈ దాడికి కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టినట్లుగా సమాచారం. మరో వైపు సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారని ముంబై లీలావతి హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. సచిన్, అంజలి దంపతులతో కూడా సైఫ్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది.