Tamannaah Bhatia: అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దు..
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:38 PM
విజయ్ వర్మతో బ్రేకప్ వార్తలతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందీ మిల్కీబ్యేటీ తమన్నా. లస్ట్‌స్టోరీస్-2 చిత్రంలో వీరిద్దకూ కలిసి పని చేశారు. అలా ప్రేమలో పడినట్లు ఇద్దరూ చెప్పారు.
విజయ్ వర్మతో (Vijay Varma) బ్రేకప్ వార్తలతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందీ మిల్కీబ్యేటీ తమన్నా (Tamannaah Bhatia) . లస్ట్‌స్టోరీస్-2 (Lust stories 2) చిత్రంలో వీరిద్దకూ కలిసి పని చేశారు. అలా ప్రేమలో పడినట్లు ఇద్దరూ చెప్పారు. కానీ ఇప్పుడు ఈ జంట అభిప్రాయ భేదాలతో విడిపోయారంటూ వార్తలొస్తున్నాయి. ఎప్పుడూ హాట్‌హాట్ ఫొటోలు, తన సినిమా అప్‌డేట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసే తమన్నా తాజాగా ఒక సందేశాత్మక పోస్ట్ పెట్టింది. జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దని ఆమె కోరారు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలని అన్నారు. తమన్నా, నటుడు విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమ బంధానికి ముగింపు (Tamannaah Bhatia-Vijay varma Breakup) పలికారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ఆమె పెట్టిన ఈ సందేశం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రవీనాటాండన్ నివాసంలో ఇటీవల జరిగిన హోలీ వేడుకలకు సైతం వీరిద్దరూ విడివిడిగా వచ్చి వెళ్లారు. ఫొటోల్లోనూ ఇదే దూరం కనిపించింది. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో విజయ్ లేడు. ఆయన పంచుకున్న ఫొటోల్లో ఆమె కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారనేది నిజమేనని తెలుస్తోంది. దీనితోపాటు ఆమె తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. రాషా థడానీ, మనీశ్ మల్హోత్రలతో కలిసి దిగిన ఈ ఫొటోల్లో ఆమె ఆనందంగా కనిపించారు. తమన్నా పెట్టిన ఈ పోస్టులు చూసిన నెటిజన్లు లవ్ ఫెయిల్ అయిందనే బాధ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాల్లో మిల్కీబ్యూటీ ఉందని భావిస్తున్నారు.
బాలీవుడ్‌లో జరిగిన ప్రతి పార్టీ, సినిమా ఈవెంట్స్‌లో కలిసి సందడి చేేసవారు. తమన్నా. విజయ్ వర్మ. ఈ ఏడాదిలో వీరి పెళ్లి ఉంటుందని భావించిన తరుణంలో విడిపోయారనే కథనాలొచ్చాయి. ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ (oDela 2)ఈవెంట్స్‌కు ఆమె ఒంటరిగా హాజరుకావడంతో ఈ ప్రచారం జరిగింది. పెళ్లి, కెరీర్ విషయంలో మనస్పర్థలు రావడంతోనే ఈ జంట ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లు తెలుస్తోంది. తమన్నా పెళ్లికి ఓటు వేయగా.. విజయ్ మాత్రం అందుకు సముఖత వ్యక్తం చేయలేదట. వివాహానికి ఇంకాస్త సమయం కావాలన్నాడని బాలీవుడ్ టాక్.