Sunny Deol: త్వరలో సెట్స్ పైకి జాట్ 2

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:18 PM

సూపర్ హిట్ మూవీ 'గదర్'కు సీక్వెల్ ను ఇరవై యేళ్ళ తర్వాత చేశాడు సన్నీ డియోల్. కానీ ఈసారి ఆలస్యం చేయకుండా 'జాట్'కు సీక్వెల్ చేయబోతున్నాడు.

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) ఖాతాలో 'జాట్' (Jaat) రూపంలో మరో హిట్ పడింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన 'జాట్' సినిమా తొలి వారం లో రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి, వంద కోట్ల క్లబ్ లో అతి త్వరలో చేరబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు 'జాట్'కు సీక్వెల్ ను తీయబోతున్నట్టు ప్రకటించాయి. దీనిని సన్నీ డియోల్ తోనే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించబోతున్నారు.


గత గురువారం 'జాట్' మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలై వారం పూర్తయిన సందర్భంగా దీని సీక్వెల్ ను ప్రకటించారు. సన్నీ డియోల్ సైతం ఈ వార్తను ఖరారు చేస్తూ సోషల్ మీడియాలో 'జాట్ 2' పోస్టర్ ను పోస్ట్ చేశారు. గతంలో 'గదర్' సినిమా ఘన విజయం సాధించిన ఇరవై యేళ్ళ తర్వాత సన్నీ డియోల్ 'గదర్ -2' చేశారు. కానీ ఇప్పుడు మాత్రం 'జాట్ 2'ను అతి త్వరలోనే పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అలానే సన్నీ డియోల్ 'బోర్డర్' మూవీ సీక్వెల్ 'బోర్డర్ -2'లోనూ నటిస్తున్నారు.

Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 17 , 2025 | 05:18 PM