Jacqueline Fernandez: ప్రేమికుల రోజుల రూ. 100 కోట్ల గిఫ్ట్ 

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:45 PM

వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు.. జైలు శిక్ష అనుభవిస్తోన్న నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ప్రేమలేఖ రాశాడు. మరో జన్ముంటే ఆమె హృదయంగా పుట్టాలనుందని అన్నాడు.

బాలీవుడ్‌ అందాల తార జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌కు (Jacqueline Fernandez) ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు.. జైలు శిక్ష అనుభవిస్తోన్న నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ప్రేమలేఖ రాశాడు. మరో జన్ముంటే ఆమె హృదయంగా పుట్టాలనుందని అన్నాడు. ఆమెకు ప్రైవేట్‌ జెట్‌ను కానుకగా ఇస్తున్నట్లు చెప్పాడు. ‘‘బేబీ.. హ్యాపీ వాలంటైన్స్‌ డే (Happy Valentine's day). ఈ సంవత్సరం మనకు ఎంతో సానుకూలంగా, ప్రత్యేకమైన విషయాలతో ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం.

Jocky.jpg

జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా. వృత్తిపరమైన పనుల రీత్యా నువ్వు వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటావు. అందుకే నీకు ఒక ప్రైవేట్‌ జెట్‌ను 9Praivate jet Gift) కానుకగా ఇస్తున్నా. నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్‌పై రాసి ఉంటాయి. అదే విధంగా నీ పుట్టిన రోజు తేదీతో రిజిరేస్టషన్‌ నంబర్‌ తీసుకున్నా. ఈ జెట్‌లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి. నాకున్న కోరిక ఒక్కటే. నాకంటూ మరో జన్మ ఉంటే.. నీ హృదయంగా పుటాలని ఉంది. ఆవిధంగా నీ గుండె చప్పుడు అవుతా. నీలాంటి అందమైన, అద్భుతమైన మనిషిని ప్రియురాలిగా కలిగినందుకు ఈ భూమ్మీద నేను అదృష్టవంతుడిని’’ అని సుఖేశ్‌ రాసుకొచ్చాడు.

(Sukesh Chandrashekhar Gifts Jet To Jacqueline Fernandez)

ALSO READ: Brahma Anandam Review: తండ్రీ, కొడుకు కలిసి నటించిన 'బ్రహ్మా ఆనందం’ మెప్పించిందా..



Jak.jpg

సుఖేశ్‌ చంద్రశేఖర్‌ (Sukesh Chandrasekhar) 2020 జూన్‌ నుంచి మే 2021 వరకు మొబైల్‌ ఫోన్లు, వాయిస్‌ మాడ్యూలర్లు వినియోగిస్తూ ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకొన్నాడు. ఆమె భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని రూ.200 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే అతడు జాక్వెలిన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె తన ప్రియురాలు అని పేర్కొన్నాడు. మరోవైపు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్‌ను నాశనం చేశాడని న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చింది. ఇంత జరిగినా సుఖేశ్‌ మాత్రం జాక్వెలిన్‌కు జైలులో నుంచే ప్రేమ లేఖలు రాస్తున్నాడు. ప్రతి పండుగకు లేఖ పంపిస్తున్నాడు.

Updated Date - Feb 15 , 2025 | 10:11 AM