Srinidhi Shetty: సీత పాత్ర వదులుకుందా... తప్పించారా...

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:52 PM

'రామాయణ' సినిమాలో సీత పాత్రకు మొదట అనుకున్నది శ్రీనిధి శెట్టినే అట! అయితే ఏ కారణంగా ఆమె ఆ పాత్రను మిస్ చేసుకుందో తెలిపింది... ఆ ముచ్చట తెలుసుకుందాం...

అందాల భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) 'కేజీఎఫ్' (KGF) ఫ్రాంచైజెస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు వివిధ భాషల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులో శ్రీనిధి శెట్టి రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన 'తెలుసు కదా' (Telusu Kada) సినిమా కాగా, మరొకటి నాని (Nani) చిత్రం 'హిట్ -3' (Hit -3). ఈ సినిమా మే 1న విడుదల కాబోతోంది. తెలుగులో పాటు 'హిట్ -3' పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో జనం ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్న శ్రీనిధి శెట్టి తాజా హిందీ సినిమా 'రామాయణ్' (Ramayan) గురించి ఓ ఆసక్తికరమైన సంఘటన తెలియచేసింది. నితీశ్‌ తివారి హిందీలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' మూవీలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగానూ, సాయిపల్లవి (Saipallavi) సీతగానూ నటిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్రకు తొలి అవకాశం తనకే లభించిందని శ్రీనిధి శెట్టి తెలిపింది.


'రామాయణ' సినిమా కోసం తాను స్క్రీన్ టెస్ట్ కు వెళ్ళానని, అలానే మూడు సన్నివేశాలు ప్రిపేర్ అయ్యి... ప్లే చేశానని, మేకర్స్ దానికి సంతోషపడ్డారని శ్రీనిధి శెట్టి తెలిపింది. అయితే... 'రామాయణ' సినిమా దర్శక నిర్మాతల నుండి ఫైనల్ కాల్ రాకముందే శ్రీనిధి శెట్టి మదిలో ఓ సందేహం ఏర్పడిందట. 'కేజీఎఫ్‌' సినిమాలో తనను, యశ్ ను ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరించిన దృష్ట్యా, 'రామాయణ'లో సీత పాత్రను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ వచ్చిందట. దానికి కారణం ఏమంటే... 'రామాయణ' చిత్రంలో రావణాసురుడిగా యశ్ చేస్తున్నాడు. సో... 'కేజీఎఫ్‌'లో జంటగా నటించినప్పుడు తమను ఆదరించిన ప్రేక్షకులు... 'రామాయణ'లో రావణ, సీత పాత్రలలో తమను ఎలా రిసీవ్ చేసుకుంటారోననే సందేశం కలిగిందని శ్రీనిధి శెట్టి తెలిపింది. ఒకవేళ ఆ కారణంగా సినిమా ఫలితం మారితే బాగుదని భావించానని శ్రీనిధి శెట్టి చెప్పింది. అయితే కొద్ది రోజులకే సీత పాత్రకు సాయిపల్లవిని తీసుకున్నారని తెలిసిందని, ఆమె ఆ పాత్రకు నూరుశాతం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఏదేమైనా ఏ 'కేజీఎఫ్' సినిమాతో అయితే ఓవర్ నైట్ స్టార్ గా శ్రీనిధి శెట్టి అవతరించిందో... అదే సినిమాతో వచ్చిన ఇమేజ్ కారణంగా 'రామాయణ' సినిమాలో సీత పాత్రను ఆమె వదులుకోవాల్సి వచ్చింది. మరి మే 1న 'హిట్ -3' జాతీయ స్థాయిలో విడుదలైన తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Also Read: Sarangapaani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 25 , 2025 | 03:53 PM