Sonam Kapoor: ఆయన్ను తలచుకుంటూ వేదికపై రావడం..  

ABN , Publish Date - Feb 02 , 2025 | 01:39 PM

బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ చాలా గ్యాప్‌ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల ఆమె ఓ ఫ్యాషన్‌ షోలో  పాల్గొని సందడి చేశారు.


బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ (Sonam kappor) చాలా గ్యాప్‌ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల ఆమె ఓ ఫ్యాషన్‌ షోలో  పాల్గొని సందడి చేశారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ (Fashion designer) దివంగత రోహిత్‌ బాల్‌కు (Rohit Bal) నివాళిగా శనివారం ఏర్పాటు చేసిన షోలో ఆమె పాల్గొన్నారు. ర్యాంప్‌ వాక్‌ చేసిన అనంతరం రోహిత్‌ బాల్‌ను గుర్తు చేసుకున్నారు. స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రోహిత్‌ బాల్‌తో సోనమ్‌ కపూర్‌కు మంచి అనుబంధం ఉంది. ఆయన డిజైన్‌ చేసిన దుస్తులను ఆమె ఎక్కువగా సెలక్ట్‌ చేసుకునేవారు. ఈ షోలో పాల్గొవడానికి ముందు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Sk.jpg

‘‘కళాత్మకత, దార్శనికతతో భారతీయ ఫ్యాషన్‌ రంగాన్ని లెజెండరీ రోహిత్‌ బాల్‌ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ ర్యాంప్‌పైకి అడుగుపెట్టడం భావోద్వేగంగా ఉంది. ఇది స్ఫూర్తిదాయకమైన ప్రయాణం’’ అని ఆమె పేర్కొన్నారు. 1961 మేలో శ్రీనగర్‌లో జన్మించిన రోహిత్‌ బాల్‌.. 1986లో తన సోదరుడు రాజీవ్‌తో కలిసి కెరీర్‌ను ప్రారంభించి దేశంలోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. ఈ రంగంలో తనదైన ముద్ర వేసి అనేక అవార్డులు అందుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఆయన మృతి చెందారు.

Updated Date - Feb 02 , 2025 | 01:48 PM