Sidharth Malhotra: చిత్రీకరణలో తనను చూశా.. అవన్నీ నాకు తెలుసు...

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:00 PM

కియారా అడ్వాణీ నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories-2018)లో యాక్ట్‌ చేస్తున్నప్పుడు ఆమెతో మాట్లాడేందుకు నేనూ ఆ చిత్రీకరణకు వెళ్లా.  ఆ సిరీస్‌లో కియారాపై ఒక వైరల్‌ సీన్‌ చిత్రీకరించారు. ఆ సీన్‌ షూట్‌ సమయంలో నేను అక్కడే ఉన్నా.


తన భార్య, హీరోయిన్‌ కియారా అడ్వాణీ (Kiara Adwani) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు సిద్థార్థ్‌ మల్హోత్ర(Sidharth Malhotra). ఆమె ఎంతో పద్ధతిగా ఉంటుందని, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపాడు. తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘కియారా అడ్వాణీ నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories-2018)లో యాక్ట్‌ చేస్తున్నప్పుడు ఆమెతో మాట్లాడేందుకు నేనూ ఆ చిత్రీకరణకు వెళ్లా.  ఆ సిరీస్‌లో కియారాపై ఒక వైరల్‌ సీన్‌ చిత్రీకరించారు. ఆ సీన్‌ షూట్‌ సమయంలో నేను అక్కడే ఉన్నా. ఆ తర్వాత ఆమెను కలిశా. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఈ సిరీస్‌కు సంబంధించిన కథను కరణ్‌ జోహార్‌ నాకు ముందే చెప్పారు. ఇలాంటి స్టోరీతో సిరీస్‌ చేయడం నాకు ఆసక్తిగా అనిపించింది. స్ర్కిప్ట్‌ ఎంపిక విషయంలో కియారా ఎంతో క్లియర్‌గా ఉంటుంది. విభిన్నమైన కథలు ఎంచుకోవడానికి ఇష్టం చూపిస్తుంది.

2.jpg

మా వివాహం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకున్నా. ఆమెతో ప్రయాణం మొదలయ్యాక పలు అంశాలపై నా అభిప్రాయం మారింది. జీవితం, వర్క్‌, కుటుంబంపై సరైన అవగాహన వచ్చింది. తను కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. పద్థతులు పాటిస్తుంది. ఆమెలో నాకు నచ్చే విషయమదే. తల్లిదడ్రులుగా పిల్లల ఆలరాపాలనా దగ్గరుండి చూసుకోవాలనేది నా ఆలోచన. అలా చేస్తేనే పిల్లలతో మనకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. నా చిన్నతనంలో నాన్న వర్క్‌లైఫ్‌ బిజీగా ఉండటం వల్ల అమ్మే మా బాగోగులు చూసుకునేవారు. ఓవైపు  స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తూనే మరోవైపు, మా విషయాలు పట్టించుకునేవారు. నా దృష్టిలో ఆమే నా రాక్‌స్టార్‌’’ అని అన్నారు. సిద్థార్థ్‌ మల్హోత్ర, కియారా ప్రేమంచుకున్నారు. పెద్దల అంగీకారంతో 2023లో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

 

Updated Date - Mar 12 , 2025 | 04:01 PM