Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌.. కింగ్‌ షారుక్‌ ఖాన్‌ కానున్నాడు..

ABN , Publish Date - Jan 27 , 2025 | 11:48 AM

తదుపరి చిత్రం గురించి షారుక్ ఖాన్ స్వయంగా అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల ఓ వేదికపై మాట్లాడిన ఆయన త్వరలో ‘కింగ్‌’తో (King Movie) రానున్నట్లు చెప్పారు.

'పఠాన్‌', 'జవాన్‌', 'డంకీ' చిత్రాలతో 2023లో హాట్రిక్‌ సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan). గత ఏడాది ఆయన నుంచి ఏ సినిమా రాలేదు. తదుపరి చిత్రం గురించి ఆయన స్వయంగా అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల ఓ వేదికపై మాట్లాడిన ఆయన త్వరలో ‘కింగ్‌’తో (King Movie) రానున్నట్లు చెప్పారు. సిద్థార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) దర్శకత్వంలో ఇది రూపొందుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘పఠాన్‌’ తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. (Shah Rukh Khan CONFIRMS reunion with director Siddharth Anand)

‘‘ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. మరో రెండు నెలలు నా షెడ్యూల్‌ ఉంటుంది. నా డైరెక్టర్‌ సిద్థార్థ్‌ ఆనంద్‌ చాలా స్ట్రిక్ట్  అని అందరికీ తెలుసు. మేం ఏం చేస్తున్నామో బయటకు చెప్పొద్దని చెప్పారు. ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని మాత్రమే మీకు చెప్పగలను. ఈ విషయంలో మీకు హామీ ఇస్తున్నా. ప్రేక్షకులు, అభిమానులు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. షారుక్‌ ఖాన్‌.. కింగ్‌ షారుక్‌ ఖాన్‌ కానున్నాడు. టీమ్‌ చాలా కష్టపడి పనిచేస్తోంది. అందరూ గర్వపడే సినిమా ఇది’’ అని తెలిపారు. ఇంతకుముందు ఈ చిత్రం గురించి మాట్లాడిన షారుక్‌ ఇలాంటి కథ కోసం ఎనిమిదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ‘యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో నటించడం అంత సులభం కాదు. సాధన చేయాలి, ఎన్నో నేర్చుకోవాలి. కొన్నిసార్లు ప్రమాదకరమైన స్టంట్స్‌ను డూపులు చేస్తారు. అలా చేయడానికి నాకు అద్భుతమైన టీమ్‌ ఉంది. కానీ, ఫైట్‌ సీన్స్‌లో 80 శాతం మనం మాత్రమే చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అది సహజంగా అనిపించదు కదా’ అని ఆయన అన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 11:48 AM