Shweta Basu Prasad : టాలీవుడ్‌లో హీరోతో.. టీమ్‌తోనూ ఇబ్బంది పడ్డాను..

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:58 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి మాట్లాడారు. ఒక తెలుగు సినిమా సెట్‌లో దారుణంగా అవమానించారని అన్నారు.

ఎక్కాడా..

యెప్పుడూ..

అంటూ ‘కొత్తబంగారు లోకం’లో(Kotha Bangaru lokam) డిఫరెంట్‌ స్లాంగ్‌తో అలరించింది శ్వేతా బసు ప్రసాద్‌(Shweta Basu Prasad). మొదటి సినిమాతోనే  కుర్రకారును హృదయాల్లో ప్రత్యేక క్రేజ్‌ తెచ్చుకుంది. కొన్నేళ్లుగా ఆమె తెలుగు సినిమాకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి మాట్లాడారు. ఒక తెలుగు సినిమా సెట్‌లో దారుణంగా అవమానించారని అన్నారు. ఆ సెట్‌లో ప్రతిఒక్కరూ శరీరాకృతి విషయంలో ఎంతగానె ఎగతాళి చేశారని చెప్పారు. ఆ మాటలు ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నటిగా నేను సంతృప్తిగానే ఉన్నా. నాకు నచ్చిన సినిమాలు చేశాను. ప్రస్తుతం టెలివిజన్‌ ఇండస్ర్టీలో రాణిస్తున్నాను. కెరీర్‌ పరంగా ఇబ్బందిపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్‌లో చాలా ఇబ్బందిపడ్డా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని సెట్‌లో ఉన్న ప్రతిఒక్కరూ నన్ను ఎగతాళి చేేసవారు. హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5 అడుగులు (Body Shaming in tollywood) ఉందని కామెంట్‌ చేసేవారు. ఇక, హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తుండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్‌ ఎక్కువగా తీసుకునేవాడు. తెలుగులో డైలాగ్స్‌ చెప్పలేకపోయేవాడు. నిజం చెప్పాలంటే నాక్కూడా తెలుగు సరిగ్గా రాదు. కానీ, నేను ఏదో ఒకరకంగా డైలాగ్స్‌ నేర్చుకొని షూట్‌లో నడిపించేదాన్ని. అతను మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగే అయినప్పటికీ అతనికి భాషపై పట్టు లేదు కానీ, నన్ను మాత్రం నా కంట్రోల్‌లో లేని నా ఎత్తు గురించి కామెంట్‌ చేేసవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా. దానికి నేనేం చేేసది. నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్‌ ఏదైనా ఉందంటే అదే’’ అని శ్వేతా బసు అన్నారు.


11 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్‌ ప్రారంభించింది శ్వేతా బసు ప్రసాద్.  ‘మక్ది’ అనే సినిమా ఆమె నటించిన తొలి చిత్రం. 2008లో తెరకెక్కిన ‘కొత్తబంగారు లోకం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా విజయం తర్వాత ‘రైడ్‌’, ‘కాస్కో’, ‘కళవర్‌ కింగ్‌’, ‘ప్రియుడు’, ‘జీనియస్‌’ వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేశారు. 2018లో విడుదలైన ‘విజేత’ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో యాక్ట్‌ చేయలేదు. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు, సీరియళ్లు చేస్తూ బిజీగా ఉంది. అప్పుడప్పుడు దర్శకత్వ శాఖలోనూ పని చేస్తుంటుంది.

Swetha.jpg

Updated Date - Feb 17 , 2025 | 02:01 PM