Shreya Ghoshal: జనాలు బాధలో ఉంటే.. షో ఎలా చేస్తాం..
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:48 PM
పహల్గాం వివాదం దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి తర్వాత దేశమంతా పరిస్థితులు ఉత్కంఠగా మారాయి.
పహల్గాం వివాదం (Pahalgam attack) దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి తర్వాత దేశమంతా పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఈ నేపథ్యంలోనే గాయనీగాయకులు తమ కాన్సర్ట్స్‌ను రద్దు చేసుకుంటున్నారు. అర్జిత్ సింగ్ (Arijit singh) ఏప్రిల్ 27న చెన్నైలో జరగాల్సిన తన షో రద్దు చేసుకున్నారు. గాయని శ్రేయాఘోషల్ (Shreya Ghoshal) కూడా తన కాన్సర్ట్ రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శనివారం
సాయంత్రం సూరత్ వేదికగా జరగాల్సిన తన షోను క్యాన్సిల్ చేసుకుంటున్నానని ఆమె వెల్లడించారు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగిస్తామని చెప్పారు.
‘ఆల్ హార్ట్స్ టూర్’ పేరుతో దేశ విదేశాల్లో మ్యూజికల్ షోలు నిర్వహిస్తున్నారు శ్రేయాఘోషల్. ఇందులో భాగంగానే ఆమె ఇప్పటికే చెన్నై, కోయంబత్తూర్‌లో కాన్సర్ట్స్ నిర్వహించారు. శనివారం సూరత్‌లో జరగాల్సిన కార్యక్రమం రద్దు అయింది. ముంబయిలో మే 10న షో జరగనుంది. సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ సైతం ‘హుకుమ్’ పేరుతో వరల్డ్ టూర్ నిర్వహిస్తున్నారు. మే 31న బెంగళూరులో జరగనున్న కాన్సర్ట్‌కు సంబంధించిన టికెట్లు విడుదల చేయగా.. గంటలోనే సేల్ అయిపోయాయి. ప్రేక్షకాదరణను దృష్టిలోఉంచుకొని జూన్ 1వ తేదీన కూడా ఈ కార్యక్రమాన్ని కొనరొస?్తమని టీమ్ ప్రకటించింది. అయితే, రెండోరోజు కాన్సర్ట్‌కు సంబంధించిన టికెట్ సేల్స్‌ను మాత్రం ఉగ్రదాడి నేపథ్యంలో వాయిదా వేసింది.