Shalini panday: అర్జున్‌రెడ్డి పాత్రపై షాలినీ కామెంట్స్‌

ABN , Publish Date - Mar 18 , 2025 | 06:34 PM

సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది షాలినీ పాండే (Shalini Panday). ప్రీతి పాత్రలో అందరినీ మెప్పించింది.

Shalini Panday


సందీప్‌రెడ్డి వంగా (Sandeep reddy vanga) దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ (Arjuna Reddy) సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది షాలినీ పాండే (Shalini Panday). ప్రీతి పాత్రలో అందరినీ మెప్పించింది. అయితే ఆ సినిమాలోని నటీనటుల పాత్రలను ఎంతో మంది విమర్శించారు. హీరోయిన్‌ పాత్ర వీక్‌ అని పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని ఆ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డబ్బా కార్టెల్‌’ సిరీస్‌లో బలమైన మహిళగా కనిపించిన తర్వాత కూడా షాలినీ మరోసారి ‘అర్జున్‌ రెడ్డి’ లాంటి సినిమాను అంగీకరిస్తారా అనే ప్రశ్నకు ఆమె స్పందించారు.

‘‘నేను కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో నటించిన సినిమా అది. ఇప్పుడు దాని గురించి ఆలోచిేస్త అమాయకంగా అనిపిస్తోంది. నా పాత్ర మరింత బలంగా చేయొచ్చేమో అని అనుకుంటున్నా. మరోసారి అలాంటి అవకాశం వస్తే నో చెప్పను. దానిపై మరింత అవగాహన పెంచుకొని యాక్ట్‌ చేస్తాను. అప్పటికంటే ఇప్పుడు నటిగా పరిణితి చెందాను కాబట్టి వేరియేషన్‌ చూపిస్తాను. నిజాయతీగా చెప్పాలంటే దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని అంగీకరిస్తా’’ అని అన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 06:34 PM