Shakeela: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి షకీలా బయోపిక్‌

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:46 PM

నటి షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం షకీలా. ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో రిచా చెద్ద షకీలా హీరోయిన్‌గా నటించింది.

నటి షకీలా (Shakeela) జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం షకీలా (Shakeela biopic). ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో రిచా చెద్ద (Richa chedda) షకీలా హీరోయిన్‌గా నటించింది. అలాగే పంకజ్‌ త్రిపాఠీ, టాలీవుడ్‌ నటి ఎస్తర్‌, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్‌, సందీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 25, 2020న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ బయోపిక్‌ను రిలీజ్‌ చేశారు. అయితే షకీలా సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఎక్కువగా అడల్డ్‌ కంటెంట్‌ ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను ఆదరించారు. దీనికి తోడు షకీలాకు ఉన్న క్రేజ్‌ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్‌లో కూడా ఈ చిత్రాన్ని షేర్‌ చేశారు. కాగా ఇప్పుడీ బోల్డ్‌ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత షకీలా మూవీ స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. (Shakeela biopic in Ott)

అమెజాన్‌ ప్రైమ్‌లో షకీలా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ తెలుగు వర్షన్‌ కోసం సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే మరో రెండురోజుల్లో షకీలా తెలుగు వర్షన్‌ కూడా స్ర్టీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది.

Updated Date - Mar 04 , 2025 | 12:19 PM