Shahid - Kareena : ఒకప్పటి లవర్స్‌.. ఆత్మీయ ఆలింగనం

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:08 PM

ఐఫా అవార్డు వేడుకలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు షాహిద్‌ కపూర్‌, కరీనాకపూర్‌ పక్కపక్కనే ఉండి మాట్లాడుకోవడమే కాకుండా.. ఆ


ఐఫా (IFFA)అవార్డు వేడుకలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor), కరీనాకపూర్‌ (kareena kapoor) పక్కపక్కనే ఉండి మాట్లాడుకోవడమే కాకుండా.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సుమారు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించడం బీటౌన్‌ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. 2007లో విడుదలైన ‘జబ్‌ వి మెట్‌’తో క్యూట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు షాహిద్‌, కరీనా. ఈ సినిమా కంటే ముందు వీరిద్దరూ ‘చుప్‌ చుప్‌ కే’, ‘ఫిదా’, ‘36 చైనా టౌన్‌’ వంటి ప్రాజెక్టుల్లో కలిసి పని చేశారు. దీంతో వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నారు. 2007లో విడిపోయారు.

ఆ తర్వాత కలిసి నటించినా, ఏదైనా ఈవెంట్స్‌లో పాల్గొంటే మాత్రం దూరం పాటిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఐఫా కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే నిల్చొని కనిపించారు. తొలుత కొన్ని క్షణాల పాటు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఫైనల్‌గా  సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వుకుంటూ ఫొటోలు దిగారు. హగ్‌ చేసుకున్నారు. ఈ రీయూనియన్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఆదిత్య, గీత్‌లను(జబ్‌ వి మెట్‌లో వీరి పాత్రలు) ఇలా చూడటం సంతోషంగా ఉంది’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై షాహిద్‌ కపూర్‌ మాట్లాడారు. ‘‘ఇది మాకు ఏమాత్రం స్పెషల్‌ కాదు. చాలా కార్యక్రమాల్లో మేమిద్దరం కలుస్తూనే ఉంటాం. మాకు సాధారణ విషయమే. మా మీట్‌ ప్రేక్షకులను ఆకర్షిేస్త మంచిదే’’ అని అన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 02:08 PM