Shah Rukh Khan: అంతర్జాతీయ వేదికపై సౌత్ స్టార్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షారుఖ్

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:15 PM

Shah Rukh Khan: ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలో సౌత్ స్టార్స్ ప్రాభల్యం పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్' సౌతిండియన్ స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Shah Rukh Khan Advice to South Indian Stars

బాలీవుడ్ 'బాద్ షా' షారుఖ్ ఖాన్ ఏదైనా మొహమాటం లేకుండా క్లియర్ గా చెప్పేస్తారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువ. లవర్ బాయ్ గా ఆయనకున్న ఇమేజ్ ని ఏ ఇతర స్టార్ యాక్టర్స్ మ్యాచ్ చేయలేరు. ఆయన 2023లో సౌతిండియన్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేసిన సినిమా 'జవాన్' రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతారతో పాటు విజయ్ సేతుపతి కూడా నటించారు. ఇది ఇలా ఉండగానే షారుఖ్ సౌతిండియన్ స్టార్స్ కి ఓ విజ్ఞప్తి చేశాడు. అదేంటంటే


ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ యాక్టర్ అయినా షారుఖ్ బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన దేశాలలో ఒకటైన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్' టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన దుబాయ్ లో జరిగిన ‘గ్లోబల్‌ విలేజ్‌’ ఈవెంట్ కు హాజరయ్యాడు. సౌతిండియన్ స్టార్స్ ప్రభాస్‌, మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, యశ్‌, రజనీకాంత్‌, విజయ్‌ లతో తన స్నేహాన్ని వివరించాడు. ఇలా ఒక్కక్కరి పేర్లు ప్రస్తావిస్తుండగా స్టేజ్ దద్దరిల్లింది. అనంతరం షారుఖ్ మాట్లాడుతూ.. 'సౌతిండియన్ స్టార్స్ కొంచెం వేగంగా డ్యాన్స్‌ చేయడం ఆపేయాలి, వారి స్పీడ్ ని మ్యాచ్ చేయలేకపోతునన్నని' అంటూ తనదైన సెన్సాఫ్ హ్యూమర్ తో జోక్ చేశాడు.


'పఠాన్‌', 'జవాన్‌', 'డంకీ' చిత్రాలతో 2023లో హాట్రిక్‌ సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌. గత ఏడాది ఆయన నుంచి ఏ సినిమా రాలేదు. తదుపరి చిత్రం గురించి ఆయన స్వయంగా అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల ఓ వేదికపై మాట్లాడిన ఆయన త్వరలో ‘కింగ్‌’తో రానున్నట్లు చెప్పారు. సిద్థార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘పఠాన్‌’ తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read- Coldplay: 'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో మార్మోగిన తెలంగాణ పేరు

Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

Also Read-Baapu Teaser: 'బలగం' లాంటి మరో కథ.. బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 06:19 PM