Sara Ali Khan: సారా ప్రేమ విషయంలో జరిగిందిదే
ABN , Publish Date - Jan 24 , 2025 | 12:08 PM
Sara Ali Khan: సారా అలీ ఖాన్ ఎంత పెద్ద మహాశివుడి భక్తురాలో ఆమె ఫాలోయర్స్ కి బాగా తెలుసు. ఆమె తరుచుగా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించే విషయం తెలిసిందే. ఇటీవలే ఏపీలోని శ్రీశైల మల్లిఖార్జున స్వామిని కూడా దర్శించుకున్నారు. కానీ.. ఆమె ప్రేమ విషయంలో ఏం జరిగిందంటే..
బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఆమె నటన పరంగా పర్వాలేదు. సోషల్ లైఫ్ లో మాత్రం అల్వేస్ ట్రెండింగ్. ఆమె జెన్ జీ(Gen Z) నటి. ఆమె బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. పార్టీస్, ఫ్రెండ్స్, ట్రిప్స్, యాక్సెంట్ అని డిఫరెంటే. అయితే ఆమె ట్రిప్స్ కు రెగ్యులర్ వెళ్లే విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె డేటింగ్ లైఫ్ పై అనేక వార్తలు ప్రచారం అవుతుంటాయి. మరి తాజాగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటంటే..
సారా అలీ ఖాన్ ఎంత పెద్ద మహాశివుడి భక్తురాలో ఆమె ఫాలోయర్స్ కి బాగా తెలుసు. ఆమె తరుచుగా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించే విషయం తెలిసిందే. ఇటీవలే ఏపీలోని శ్రీశైల మల్లిఖార్జున స్వామిని కూడా దర్శించుకున్నారు. ఇదంతా పక్కనా పెడితే.. ఆమె యాక్టర్ అరుణ్ బజ్వా ప్రతాప్ తో కేదార్నాథ్ వెళ్లిన ఫోటోలు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించాయి. వీళ్లిద్దరు స్నేహితులు మాత్రమే కాదు డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. ఇది ఇలా ఉండగానే రాజస్థాన్ లో వీరిద్దరూ ఒకే ప్రదేశంలోని ఫోటోలని వేరువేరుగా షేర్ చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత ఊపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అర్జున్ బజ్వా మరింతా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. ఆయన ఏమన్నారంటే.
రీసెంట్ గా బజ్వా, సారాల రిలేషన్షిప్ గురించి అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై బజ్వా స్పందిస్తూ.."ఎవరు ఏది రాయాలి అనుకుంటే అది రాస్తారు. అది వారి డ్యూటీ. ఎవరు చేయాల్సిన పనిపై వారు దృష్టి సారించడం మంచిదే. నేను కూడా నేను చేయాల్సిన పనిపై దృష్టి సారిస్తున్న" అన్నారు. దీంతో కొందరు ఆ జంటకు ప్రైవసీ ఇవ్వాలని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తుంటే. మరికొందరు ఆయన వార్తలను ఖండించలేదు కాబట్టి.. వాళ్లిదరు డేటింగ్ లో ఉన్నా వార్తలు నిజమే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.