Sandeep Reddy Vanga: సినిమా తీయడం కంటే అదే ఈజీ

ABN , Publish Date - Mar 02 , 2025 | 01:48 PM

‘యానిమల్‌’ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పందించారు.


‘యానిమల్‌’ (Animal) చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పందించారు. సదరు అధికారిపై దర్శకుడు విమర్శలు చేశారు. కష్టపడి పుుస్తకాలు చదివితే ఐఏఎస్‌ (Ex IAS) కావొచ్చని.. కానీ, ఫిల్మ్‌ మేకర్‌ కావాలంటే ఎలాంటి కోర్సులు లేవన్నారు. ‘ఒక ఐఏఎస్‌ అధికారి ఇటీవల యానిమల్‌’ సినిమాపై చేసిన వ్యాఖాలు నాకు గుర్తున్నాయన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘12Th ఫెయిల్‌’లో యూపీఎస్సీ ప్రొఫెసర్‌గా నటించిన మాజీ ఐఏఎస్‌ అధికారి వికాస్‌ దివ్య కీర్తి (Vikaa Divya Keerthi) ఆ సినిమా విడుదలైన సమయంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. సమాజానికి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు అవసరమన్నారు. అనంతరం ఆయన ‘యానిమల్‌’ను ఉద్దేశించి విమరలు చేశారు. ఈ తరహా చిత్రాలు సమాజానికి అనవసరమైనవి అన్నట్లు మాట్లాడారు. వీటి వల్ల డబ్బు మాత్రమే సంపాదించగలమని చెప్పారు. సినిమా తీసేటప్పుడు సామాజిక విలువలు పాటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.



దీనిపై దర్శకుడు సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ "ఇలాంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్నది ఆయన అభిప్రాయం. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లిపోయిందన్నారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా నన్నెంతో బాఽధించాయి. నేనేదో నేరం చేశాననిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారనిపించి కోపం వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కటే అర్థం చేసుకున్నా. ఐఏఎస్‌ అధికారి కావాలంటే.. ఢిల్లీ వెళ్లి ఏదైనా ఒక సంస్థలో చేరి కష్టపడి చదివితే చాలు. అదే ఫిల్మ్‌ మేకర్‌, లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. నీకు నువ్వుగా అన్నీ నేర్చుకోవాలి. అభిరుచితోనే ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని కావాలంటే నేను పేపర్‌పై కూడా రాసి ఇస్తాను’’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం సందీప్‌ ప్రభాస్‌తో చేస్తున్న ‘స్పిరిట్‌’ గురించి చెప్పుకొచ్చారు. ‘‘మా సినిమా ‘బాహుబలి’ని దాటాలంటే రూ.2000 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టాలి. అది చాలా పెద్ద విషయం. ఇప్పటికేౖతే నేను మంచి సినిమా చేస్తాను. అది ఎంత కలెక్ట్‌ చేస్తుందనేది చూడాలి’’ అని అన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 01:48 PM