Sikandar: 'సికందర్‌’ను పట్టిన పైరసీ భూతం.. టీమ్‌ ఏం చేసిందంటే..

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:11 PM

టెక్నాలజీ పెరిగిన కొద్దీ పైరసీ సినిమా ఇండస్ట్రీని దెబ్బతీస్తోంది. సినిమా విడుదలైన క్షణాల్లోనే పైరసీ బారిన పడుతుంది.



టెక్నాలజీ పెరిగిన కొద్దీ పైరసీ సినిమా ఇండస్ట్రీని దెబ్బతీస్తోంది. సినిమా విడుదలైన క్షణాల్లోనే పైరసీ బారిన పడుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘సికందర్‌’ (Sikandar) చేరింది. ఆదివారం బాక్సాఫీసు ముందుకు రాకముందే.. శనివారం రాత్రి ఈ మూవీ ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది. ఫిల్మ్‌ క్రిటిక్‌ ఒకరు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడంతో ఆ విషయం తాజాగా బయటకు వచ్చింది. చాలా వెబ్‌సైట్లలో శనివారం రాత్రి ‘సికందర్‌’ (Sikandar) మూవీ ప్లే అయిందని, వెంటనే తొలగించినా నిర్మాత సంబంధిత అధికారులను కోరినా జరగాల్సిన నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మేకర్స్‌ పోలీసులను ఆశ్రయించారని, దర్యాప్తు జరుగుతోందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన యాక్షన్‌  సినిమా ఇది. రష్మిక కథానాయిక.  

ALSO READ:

Mega 157: చిరంజీవి 157.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దే లేదు..

Harish Shankar: ఉస్తాద్‌ కథ ఎక్కడిదాకా వచ్చిందంటే..

Upasana: రామ్ చరణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.. ఉపాసన 

Dokka Seethamma: తెరపైకి డొక్కా సీతమ్మ కథ..


Updated Date - Mar 30 , 2025 | 03:20 PM