Salman Khan: బాలీవుడ్ బిగ్ వన్ షోకు పహల్గాం దెబ్బ
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:32 AM
పహల్గాం ఉదంతం కారణంగా బాలీవుడ్ లో పలు కార్యక్రమాలు రద్దు అయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. అలా మే 4, 5 తేదీలలో లండన్ లో జరగాల్సిన బాలీవుడ్ బిగ్ వన్ సైతం పోస్ట్ పోన్ అయ్యింది.
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి ప్రభావం చాలా తీవ్రప్రభావాన్నే చూపుతోంది. పాకిస్తాన్ పై భారత్ ఎలా పగ తీర్చుకోబోతోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఇదే సమయంలో పహల్గాం లో మామూలు వాతావరణాన్ని నెలకొల్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడికి తిరిగి పర్యాటకులను రప్పించడానికి, వారితో ఆత్మ స్థైర్యాన్ని కల్పించడానికి వారు తమ వంతు కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పహల్గాం దాడి బాలీవుడ్ (Bollywood) చిత్రసీమనూ ఓ కుదుపు కుదిపింది. దీనివల్ల పలు ప్రధానమైన కార్యక్రమాలు సైతం వాయిదా పడ్డాయి. అందులో ప్రధానమైంది మే 4, 5 తేదీలలో లండన్ లో జరగాల్సిన 'బాలీవుడ్ బిగ్ వన్'! పహల్గాం దాడి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించడం సబబు కాదని గ్రహించిన నిర్వాహకులు దీనిని వాయిదా వేశారు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ (Salmankhan) అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ ప్రదర్శన కోసం లండన్ లోని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, అయితే దీనిని వాయిదా వేయడం వారికి బాధను కలిగిస్తుందని తనకు తెలుసునని సల్మాన్ అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన క్షమాపణలు తెలిపారు. ఇప్పుడు క్లిష్టపరిస్థుతులలో అందరి క్షేమం తమకు ప్రధానమని, దానిని దృష్టిలో పెట్టుకునే ఈ ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేశామని ఆయన అన్నారు. అతి త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్ (Varun Dhavan), టైగర్ ష్రాఫ్, కృతీసనన్ (Kriti Sanon) తదితరుల పాల్గొనవలసి ఉంది.
Also Read: Sreeleela: శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి