Salman khan: సల్మాన్ టైంకి రాడు.. నిబద్దత లేదు.. రియాక్షన్ 

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:24 PM

‘సికందర్‌’ (Sikandar) ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ తనపై వచ్చిన విమర్శలను ఖండించారు

తమిళ దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ (AR Murugadoss) దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (Salman khan) నటించిన చిత్రం ‘సికందర్‌’ (Sikandar) ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ తనపై వచ్చిన విమర్శలను ఖండించారు. ‘‘సినిమా షూటింగ్‌లకు నేను ఆలస్యంగా వస్తున్నట్లు, పనిపై నిబద్థత లేదంటూ వచ్చిన కథనాలు నా చెవిన పడ్డాయి. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేశాను. సెట్స్‌కు ఆలస్యంగా వస్తే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. వంద శాతం క్రమశిక్షణతో ఉంటాను కాబట్టే ఎదిగాను. హీరోలంతా ఉదయం 6 గంటలకు పని ప్రారంభిస్తారు. నేను మాత్రం 11 దాటాకే షూటింగ్‌లకు హాజరవుతాను. ఒక్కసారి సెట్‌కు వచ్చాక విశ్రాంతి తీసుకోను. కనీసం కారవాన్‌లోకి కూడా వెళ్లను. ఈ విషయం నాతోపాటు పని చేసిన ప్రతి ఒక్కరికీ, ఇప్పుడు నాతో కలిసి నటించిన రష్మికకు కూడా తెలుసు. సెట్‌లో వేసిన టెంట్‌లోనే కూర్చొని ఉంటాను. ఒక సినిమా రూపొందించాలంటే కనిపించని కష్టం ఉంటుంది. సెట్‌లో నా పని నేను చేసి వెళ్లిపోతాను అని అందరూ అనుకుంటారు. కానీ, అది వాస్తవం కాదు.. నేను సినిమాకు సంబంధించిన ప్రతి పనిలోనూ భాగమవుతా. దాన్ని అందరికీ చూపించడానికి ప్రయత్నించను. నా మనసు నిరంతరం సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సన్నివేశాలను ఎలా తీస్తే బాగుంటుందో ఆలోచిస్తుంటాను. అలాగే ఓ రచయిత కుమారుడిగా డైలాగుల విషయంలోనూ విశ్లేషిస్తుంటాను’’ అని అన్నారు.


ఇదే విషయంపై రష్మిక కూడా మాట్లాడారు. సల్మాన్‌ ఇచ్చిన వివరణతో ఏకీభవిస్తున్నా. నేను ‘సికందర్‌’లో వర్క్‌ చేయడానికి ముందు ఆయన గురించి ఎన్నో కథనాలు విన్నాను. అవన్నీ నిజం కాదని సికందర్‌ సెట్‌లో అర్థమైంది. ఆయన సెట్‌లోనే ఉంటారు. నేను విన్నది.. చూస్తున్నది రెండూ వేర్వేరు విషయాలని అర్థమైంది. ఆయన చాలా డిసిప్లేన్‌గా ఉంటారు. ఇదే నిజం. ఆయనపై ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కాలేదు’’ అని రష్మిక అన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:26 PM