Salman Khan: అట్లీ - సల్మాన్ సినిమాకు సమస్య అదేనా..
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:22 PM
‘సికందర్’ ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల తనకు వచ్చిన బెదిరింపుల గురించి మాట్లాడారు.
‘సికందర్’తో (Sikandar) ప్రేక్షకుల్ని అలరించనున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan). ఇందులో రష్మిక కథానాయిక. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల తనకు వచ్చిన బెదిరింపుల గురించి మాట్లాడా
‘‘అట్లీతో (No atlee Movie) సినిమా ఉంటుందని అనుకోవడం లేదు. దీని పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తిచేయాలని అనుకున్నాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరిదిద్దడానికి ప్రయత్నించాం. కానీ ముందుకుసాగలేదు. కచ్చితమైన కారణం నాకూ తెలియదు. బహుశా భారీ బడ్జెట్ కావడం ఓ కారణం కావచ్చు. అందుకే వాయిదా వేస్తున్నాం’’ అని అన్నారు.
బెదిరింపులు గురించి చెబుతూ ‘‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయుష్షు ఉన్నంతవరకు జీవిస్తాం ఎవరైనా. బెదిరింపులు నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. కొన్నిసార్లు ఈ భద్రత కూడా ఛాలెంజ్‌గా అనిపిస్తోంది. ఈ నెల 28న వస్తున్న మోహన్‌లాల్ ఎల్2: ఎంపురాన్ చిత్రం గురించి మాట్లాడారు సల్మాన్. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ గురించి సల్మాన్ స్పందించారు. ‘‘ఒక నటుడిగా మోహన్‌లాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది అద్భుతమైన సినిమాగా నిలిచిపోతుంది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.