Salman Khan: సౌత్ భామపై సల్మాన్ కన్ను..
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:57 PM
Salman Khan: సల్మాన్ ఖాన్ ఓ సౌతిండియన్ హీరోయిన్ మళ్ళీ మళ్ళీ కావాలంటున్నాడట. దీంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా డైరెక్టర్ సేమ్ హీరోయిన్ ని కన్ఫార్మ్ చేశాడట.
బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కు ఒక హీరోయిన్ పై కన్ను పడిందంటే వరుసగా తనతోనే సినిమాలు చేస్తుంటాడు. అయితే ఆయన ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నా రష్మిక మందన్నతో మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, సల్మాన్ ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నా సౌతిండియన్ డైరెక్టర్ తోనే చేయనున్నాడట. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే..
బాలీవుడ్ డెబ్యూ మూవీ 'జవాన్'తో రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ సౌతిండియన్ డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్, సల్మాన్ ఖాన్ తో ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ కోసం సల్మాన్.. అట్లీకి రికమెండేషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు. సికందర్ లో తనతో నటిస్తున్న రష్మికనేనట. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రష్మిక ఆ ప్రాజెక్ట్ కు కన్ఫార్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది.
'పుష్ప 2', 'యానిమల్' వంటి ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ లో నటించిన రష్మిక ఇప్పుడు బడా ప్రాజెక్ట్ లకు నంబర్ 1ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం ఆమె విక్కీ కౌషల్ ‘చావా’లో నటిస్తుంది. ‘మిమి’, ‘చుప్పి’ ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌషల్, భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.